జాబిల్లిపైకి ప్రైవేట్‌ కంపెనీ ‘గ్రేస్‌’ డ్రోన్‌

https://www.teluguglobal.com/h-upload/2025/02/27/500x300_1407137-moon.webp

2025-02-27 05:44:09.0

చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతంగా జెట్‌ బ్లాక్‌ బిలంపైకి దీన్ని పంపించడమే అథీనా ల్యాండర్‌ మిషన్‌ లక్ష్యం

అంతరిక్ష రేసులో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయడానికి అమెరికా కీలక చర్యలు చేపడుతున్నది. మరోసారి మానవసహిత జాబిల్లి యాత్ర చేపట్టడానికి సిద్ధమైన నాసా.. అంతకంటే ముందు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు వరుసగా ప్రయోగాలు చేస్తున్నది. తాజాగా చంద్రుడి దక్షిణ ధృవం వద్ద దిగేలా ఓ ప్రైవేట్‌ కంపెనీ చేసిన చేసిన లూనార్‌ ల్యాండర్‌ను ప్రయోగించింది. దీనిద్వారా జాబిల్లిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ఓ బిలంపైకి డ్రోన్‌ పంపడానికి ప్రణాళిక చేసింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన అథీనా ల్యాండర్‌ను స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌లో పంపించింది. నాసా కెన్నడీ స్సేస్‌ సెంటర్‌ నుంచి దూసుకెళ్లిన ఈ రాకెట్‌.. మార్చి 6న ఉపరితలంపై దిగేలా రూపొందించారు. 15 అడుగుల ఎత్తయిన ఈ అథీనా ల్యాండర్‌.. దక్షిణ ధ్రువానికి 100 మైళ్ల దూరంలో ల్యాండ్‌ అయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రాంతం జెట్‌ బ్లాక్‌ బిలానికి కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంటుంది. చంద్రుడిపై సూర్యకిరణాలు ఎన్నడూ పడని ప్రాంతంగా జెట్‌ బ్లాక్‌ బిలాన్ని అభివర్ణిస్తార. ఈ బిలంపైకి ‘గ్రేస్‌’ అనే డ్రోన్‌ను పంపించడమే అథీనా ల్యాండర్‌ మిషన్‌ లక్ష్యం. 

Private company aims,Historic moon landing,Amid new lunar race,NASA-funded experiments,Intuitive Machines’ Athena lander

https://www.teluguglobal.com//science-tech/private-company-aims-for-historic-moon-landing-amid-new-lunar-race-1116214