https://www.teluguglobal.com/h-upload/2023/07/28/500x300_801692-resume.webp
2023-07-28 13:11:48.0
ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా వాళ్లకి రెజ్యూమె పంపాలి లేదా జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్లై చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ఆ రెజ్యూమె రిక్రూటర్లను ఆకర్షించేలా ఉండాలి.
ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా వాళ్లకి రెజ్యూమె పంపాలి లేదా జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్లై చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ఆ రెజ్యూమె రిక్రూటర్లను ఆకర్షించేలా ఉండాలి. అసలు రెజ్యూమె ఎలా ప్రిపేర్ చేయాలంటే..
ఉద్యోగానికి తగిన విద్యార్హత, ఎక్స్‌పీరియెన్స్ వంటివి ఉన్నప్పటికీ వాటిని రెజ్యూమెలో ఆకట్టుకునేలా పొందుపరచకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్లు సీవీని స్పష్టంగా, ఆకట్టుకునే విధంగా రెడీ చేసుకోవాలి.
ముందుగా రెజ్యూమె అనేది వీలైనంత సింపుల్‌గా ఉండాలి. పేజీల కొద్దీ రాయడం వల్ల ఫలితం లేదు. సీవీ అనేది ఒకటి, రెండు పేజీల్లోనే క్లుప్తంగా ఉండాలి. అందులోనే వివరాలన్నింటినీ క్లియర్‌గా పొందుపరచాలి.
అయితే అన్ని రకాల పోస్టులకూ ఒకే రకమైన రెజ్యూమె పనికిరాదు. అప్లై చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమె అప్‌డేట్ చేస్తుండాలి. ఆయా జాబ్స్‌కు ఏయే స్కిల్స్ అవసరమో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రెజ్యూమెని ప్రిపేర్ చేయాలి. అప్లై చేస్తున్న ఉద్యోగానికి తగిన నైపుణ్యాల గురించి సీవీలో కచ్చితంగా ప్రస్తావించాలి. టెక్నికల్ స్కిల్స్‌తో పాటు పర్సనల్ స్కిల్స్ కూడా ముఖ్యమే.
రెజ్యూమెలో అన్నింటికంటే ముఖ్యంగా ప్రీవియస్ ఎక్స్‌పీరియెన్స్ అలాగే గతంలో మీరు సాధించిన విజయాలను ప్రస్తావించడం మర్చిపోకూడదు. ఎక్స్‌పీరియెన్స్, అచీవ్ మెంట్స్ అనేవి రిక్రూటర్లు అట్రాక్ట్ చేసే అంశాలు. అలాగే రెజ్యూమెలో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే సరైన కమ్యూనికేషన్ కోసం అడ్రస్, ఫోన్ నంబర్, -మెయిల్ ఐడీలు కరెక్ట్‌గా ఇవ్వాలి.
ఇక చివరిగా ఎలాగైనా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో అవాస్తవాలు, అబద్దాలను రెజ్యూమెలో రాయకూడదు. డాక్యుమెంట్లు, రిఫరెన్సులు, ఎక్స్‌పీరియెన్స్, స్కిల్స్ విషయంలో నిజాయితీగా ఉండాలి. అప్పుడే చేయబోయే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
Resume,Job,Resume Tips,How to Write a Resume,Career Tips
resume, job, How to prepare a resume, Resume Tips, First Resume Tips, How to Write a Resume, Career Tips, Telugu News, Telugu Global News, News, Latest News, జాబ్ కోసం రెజ్యూమె, రెజ్యూమె, రిక్రూటర్ల, జాబ్ పోర్టల్స్
https://www.teluguglobal.com//business/how-to-prepare-a-resume-for-a-job-951112