జామ్‌ నగర్‌ సింహాసనాన్ని అధిష్టించనున్న అజయ్‌ జడేజా!

https://www.teluguglobal.com/h-upload/2024/10/12/1368413-jajay-jadeja.webp

2024-10-12 09:27:22.0

తదుపరి రాజుగా ప్రకటించిన రాజ కుటుంబం

 

గుజరాత్‌ లోని జామ్‌ నగర్‌ సింహాసనాన్ని మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అధిష్టించనున్నారు. విజయ దశమి సందర్భంగా ప్రస్తుత మహారాజు శత్రుసల్య సింహ్‌జీ దిగ్విజయ్‌ సింహ్ జీ జడేజా అధికారిక ప్రకటన చేశారు. జామ్‌ నగర్ రాజ కుటుంబానికి చెందిన అజయ్‌ జడేజా 1992 -2000 సంవత్సరం వరకు భారత్‌ తరపున ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడారు. 15 టెస్ట్‌ మ్యాచ్‌ లు, 196 వన్‌ డేలు ఆడారు. 1996 వరల్డ్‌ కప్‌ లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభను క్రికెట్‌ అభిమానుల్లో అజయ్‌ జడేజా చెరగని ముద్ర వేశారు. మైదానంలో మెరుపు వేగంతో కదులుతూ ఫీల్డింగ్‌ చేసే జడేజా బ్యాట్‌ పడితే ఫోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకపడేవారు. బాల్‌ తోనూ అద్భుమైన బౌలింగ్‌ వేసి వికెట్లు రాబట్టే వారు. కామెంట్రేటర్‌ గా అజయ్‌ జడేజా ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులను అలరిస్తున్నారు. త్వరలోనే ఆయన జామ్‌ నగర్‌ మహారాజుగా పట్టాభిశిక్తుడు అవనున్నారు. జామ్‌ నగర్‌ రాజ కుటుంబానికి చెందిన రంజిత్‌ సింహ్‌ జీ, దులీప్‌ సింహ్‌ జీ.. జడేజా కన్నా ముందు క్రికెట్‌ లో అడుగు పెట్టారు. దేశావాళీ క్రికెట్‌ లో ప్రముఖ టోర్నీలు రంజీ ట్రోఫీ, దులీప్‌ ట్రోఫీ వారిద్దరి పేర్లతోనే ఏర్పాటు చేశారు.