https://www.teluguglobal.com/h-upload/2024/03/02/1302589-spanish-woman-gang-raped-in-jharkhand-three-arrested1.webp
2024-03-02 08:09:47.0
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హన్స్‌దిహా మార్కెట్ ముందు జన సంచారం లేని ప్రదేశంలో టెంట్ వేసుకుని నిద్రకు ఉపక్రమించారు.
జార్ఖండ్‌లో దారుణం జరిగింది. బైక్‌పై భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చిన ఓ స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. టెంట్‌లో నిద్రపోతున్న ఆమెపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్యాచారం.. గాయాలు
బాధితురాలు తన భర్తతో కలిసి జార్ఖండ్‌లోని దుమ్కా మీదుగా భాగల్పూర్ కు బైక్ టూర్‌కు వెళ్లారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హన్స్‌దిహా మార్కెట్ ముందు జన సంచారం లేని ప్రదేశంలో టెంట్ వేసుకుని నిద్రకు ఉపక్రమించారు. శనివారం తెల్లవారుజామున సుమారు 8 నుంచి 10 మంది దుండగులు టెంట్‌లోకి ప్రవేశించి తనను గ్యాంగ్‌రేప్ చేశారని, తీవ్రంగా కొట్టి గాయపరిచారని ఆ విదేశీ మహిళ పోలీసులకు కంప్లయింట్ చేశారు.
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
దారుణం జరిగిన వెంటనే ఆమె హన్స్‌దిహా పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. దారుణానికి పాల్పడ్డారని అనుమానిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు సమాచారం.
Spanish woman,Gang-Raped,Jharkhand,Three Arrested,Police,Tourist