జావేద్ అఖ్తర్‌‌కు సారీ చెప్పిన కంగనా ఎందుకంటే?

2025-02-28 12:46:03.0

కంగనా రనౌత్‌, సీనియర్ రైటర్ జావేద్ అఖ్తర్‌ మధ్య వివాదం మగిసింది.

బాలీవుడ్ నటి మండి లోక్ సభ ఎంపీ కంగనా రనౌత్‌, సీనియర్ రైటర్ జావేద్ అఖ్తర్‌ మధ్య వివాదం మగిసింది. వీరిద్దరు పరస్పరం దాఖలు చేసుకున్న పరువు నష్టం దావా కేసులను వెనక్కి తీసుకున్నారు. చాల ఏళ్లు తర్వాత ఈ ఇష్యు సమసిపోయింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2020లో కంగనా రనౌత్, జావేద్ అఖ్తర్ మధ్య లీగల్ యుద్ధం మొదలయ్యింది. ముందుగా కంగనా రనౌత్ ఒక టీవీ షోలో తనకు పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసిందంటూ తనపై కేసు నమోదు చేశాడు జావేద్ అఖ్తర్. కంగనా మాత్రం దీనిపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు.

తనకు అనిపించే చెప్పాను అన్నట్టుగా మాట్లాడేది. దీంతో అప్పటినుండి కంగనాపై ఈ కేసు నడుస్తూనే ఉంది. కంగనాపై మాత్రమే కాదు.. జావేద్ అఖ్తర్‌కు తనపై ఎవరైనా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారని అనిపించినా వారితో లీగల్‌గా ఫైట్ చేయడానికి సిద్ధమవుతారు. అలా చాలామంది యంగ్ ఆర్టిస్టులకు ఆయన శత్రువులాగా మారిపోయారు. కానీ తాజాగా కంగనాతో మాత్రం అన్ని మనస్పర్థలు తొలగిపోయి మళ్లీ కలిసిపోయారని తెలుస్తోంది. నాకు కలిగించిన అసౌకర్యానికి ఆమె క్షమాపణ చెపాలని అని అక్తర్ బాంద్ర కోర్టు వద్ద మీడియాకు వెల్లడించారు. 2016లో ఇమెయిల్ అంశంపై హృతిక్ రోషన్‌తో కంగానా బహిరంగంగా గొడపడ్డారు. దీనిపై రోషన్ కుటుంబానికి సారీ చెప్పాలని అక్తర్ కోరడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది

Kangana Ranaut,Javed Akhtar,Defamation suit,Legal battle,Hrithik Roshan,Bollywood,BJP,Mandi Lok Sabha,PM MODI,Social media,Bandra Court