2024-10-31 06:18:30.0
దేశ టెలికాం సంస్థలో చరిత్ర సృష్టించిన రిలయన్స్ జియో యూపీఐ సేవలను జియో అందించేందుకు సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి.
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దమైంది.ఇప్పటికే భారత నెట్ వర్క్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చింది. జియో సేవలు అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే తక్కువ ధరలకు వేగంగా నెట్‌వర్క్ ను అందించడంతో కోట్లాది భారతీయుల మన్ననలు పొందింది. అలాంటి జియో నెట్ వర్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
భారతీయులకు ఆన్ సేవలను సులభతరం చేసిన యూపీఐ సేవలను జియో అందించేందుకు సిద్ధం అయిందని వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ గా పనిచేయడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగంగా.. జియో పేమెంట్ సొల్యూషన్స్ కు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. ఇక జియో రాకతో గూగుల్‌పై, పేటీఎం, ఫోన్‌పేలు గట్టిపోటీని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Jio network,Reliance Jio,UPI services,RBI,google Pay,paytm,phone pay,mukesh ambani