https://www.teluguglobal.com/h-upload/2024/11/27/1381230-fire.webp
2024-11-27 03:01:46.0
4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలో పాలిథిన్ సంచులు తయారు చేసే ఎస్‌ఎస్‌వీ ఫ్యాబ్ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్‌కు సంబంధించిన ముడిసరుకు ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం ప్రమాదం జరగగా… అప్పటి నుంచి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నది. బుధవారం మధ్యాహ్నానికి అగ్నికీలలను పూర్తిగా ఆర్పే అవకాశం ఉన్నది. 4 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా దగ్ధమై కూలిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ముడిసరుకులు పూర్తిగా మంటల్లోఉండటంతో.. పక్కన ఉన్న కంపెనీలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.
Fire Accident,SSV Fab Industry,Jeedimetla Industrial Estate,Polythene bags made,Hyderabad