#జీవితం

2022-12-01 07:47:15.0

https://www.teluguglobal.com/h-upload/2022/12/01/428995-jeevitham.webp

ఔను…

వాళ్లిద్దరూ గొడవ పడ్డారు

ఆమె విస్పోటనమైంది

అతను మౌనమయ్యాడు

ప్రవహించిన లావాలో

అహం బూడిదైంది

ప్రశాంతతేదో కమ్ముకుంది

ఔను…

వాళ్లిద్దరూ ఇప్పుడు మళ్లీ ఇష్టపడ్డారు

కార్చిన కన్నీటిని

అది తడిపిన జీవితాన్ని

కష్టంగానైనా

ఇష్టంగానే…

వి.ఆర్. తూములూరి

VR Tumuluri,Jeevitham,Telugu Kavithalu,Telugu Poets