జూబ్లీహిల్స్‌ లో భారీ పేలుడు

https://www.teluguglobal.com/h-upload/2024/11/10/1376443-hyd-blast.webp

2024-11-10 04:33:03.0

గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీతో పేలుడు.. బాలికకు గాయాలు

హైదరాబాద్‌ లోని జూబ్లీ హిల్స్‌ రోడ్‌ నంబర్‌ -1లో ఆదివారం ఉదయం భారీ ప్రమాదం జరిగిందిన స్పైసీ కిచెన్‌ రెస్టారెంట్‌ గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ అయి భారీ పేలుడు సంభవించినట్టుగా అనుమానిస్తున్నారు. పేలుడు దాటికి గోడ కూలి సమీపంలోని బస్తీలో రాళ్లు ఎగిరిపడ్డాయి. అక్కడి ఇండ్లల్లో సామగ్రి చెల్లాచెదురు అయ్యాయి. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయని స్థానికులు చెప్తున్నారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ ప్రమాదం జరగడంతో మంటలతో పాటు తీవ్రమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరుగుతుందో తెలియక బస్తీ వాసులు ఆందోళన చెందారు. కొందరు భయంతో పరుగులు తీశారు. ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేశారు.

Havy Blast,Jubilee Hills,Spicy Kitchen Restaurant,Gas Cylinder Leakage