2025-02-18 11:22:43.0
గవర్నర్ ఆదేశాలతో ఉత్తర్వులు జారీ
జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) వైస్ చాన్స్‌లర్ గా టి. కిషన్ కుమార్ రెడ్డిని నియమించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం జేఎన్‌టీయూ వీసీని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీసీగా ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కిషన్ కుమార్ రెడ్డి ఇదివరకు ఒడిషాలోని పండిట్ దీన్‌దయాల్ పెట్రోలియన్ యూనివర్సిటీకి వైస్ చాన్స్‌లర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఉన్నత విద్యామండలి చైర్మన్ జేఎన్‌టీయూ ఇన్‌చార్జీ వైస్ చాన్స్‌లర్‌గా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో త్వరలోనే కిషన్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

JNTU H,Vice Chancellor,Prof Kishen Kumar Reddy