జైనాబ్‌ రవద్జీతో అక్కినేని అఖిల్‌ నిశ్చితార్థం

 

2024-11-26 12:02:43.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381087-akhil-jainab.webp

ట్విట్టర్‌ వేదికంగా ప్రకటించిన అక్కినేని నాగార్జున

అక్కినేని వారింట మళ్లీ పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతున్న విషయం అందరికీ తెలుసు.. కొత్తగా చెప్పేది ఏమిటి అనుకుంటున్నారా? నాగచైతన్య, శోభిత పెళ్లి తర్వాత అక్కినేని అఖిల్‌ పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. నాగార్జున ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. జైనాబ్ రవద్జీతో అఖిల్‌ నిశ్చితార్థం జరిగిందని.. ఆ విషయాన్ని అందరితో పంచుకుంటున్నందుకు సంతోషిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. జైనాబ్‌ రవద్జీని తన కుటుంబంలోకి సంతోషంతో ఆహ్వానిస్తున్నామని.. ఈ శుభ సందర్భంలో కొత్త జంట తమ జీవితాంతం ప్రేమ, ఆనందంతో జీవించాలని శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరారు.

 

Akkineni Akhil,Zainab Ravadee,Engagement,Akkineni Nagarjuna,Akkineni Family,Nagachaitanya,Shobitha Dhulipalla