‘జైలర్‌ 2’ అనౌన్స్‎మెంట్ టీజర్‌ విడుదల

 

2025-01-15 04:29:56.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/15/1394607-.webp

జైలర్ 2 అనౌన్స్‎మెంట్ టీజర్‎ను చిత్ర యూనిట్ విడుదల చేసింది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్‌లో ‘జైలర్‌ 2’ను చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. సంక్రాంతి సందర్భంగా ‘జైలర్‌ 2′ అనౌన్స్‌మెంట్‌ టీజర్‌ను రిలీజ్ చేసింది. . ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. రజినీకాంత్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. జైలర్ మూవీలో సూపర్ స్టార్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ నటులు అతిధి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

వినాయకన్, తమన్నా భాటియా, వసంత్ రవి, మీర్నా మీనన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రల్లో సందడి చేశారు. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజునే మంచి కలెక్షన్లు సాధించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 

‘Jailor 2′ Movie,Superstar Rajinikanth,Ramya Krishna,Mohanlal,Shivraj Kumar,Vinayakan,Tamannaah Bhatia,Vasanth Ravi,Mirna Menon,Yogi Babu,Director Nelson Dilip Kumar,’Jailor 2’ Movie teaser