2025-02-27 06:28:23.0
బీజేపీ సర్కార్‌పై మాజీ సీఎం, శాసనసభలో ప్రతిపక్ష నేత ఆతిశీ ఎక్స్ వేదికగా ఆగ్రహం
https://www.teluguglobal.com/h-upload/2025/02/27/1407150-atishi.webp
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ సమావేశాల వేళ బీజేపీ సర్కార్‌పై విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సంచలన ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా బారికేడ్లు పెట్టి మరీ అడ్డుకుంటున్నారని ఆరోపించింది. ఈ మేరకు మాజీ సీఎం, శాసనసభలో ప్రతిపక్ష నేత ఆతిశీ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే నియంతృత్వంలో అన్నిహద్దులు దాటేశారు. సభలో జై భీమ్ అని నినాదాలు చేసినందుకు మా పార్టీ ఎమ్మెల్యేలను మూడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇప్పుడు విధాన సభ ప్రాంగణంలోకి రాకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి దారుణం ఎన్నడూ చోటుచేసుకోలేదు’ అని ఆమె దుయ్యబట్టారు.
Delhi Assembly,AAP leader Atishi says,AAP MLAsSuspended,‘Jai Bhim’ slogans,Fire on BJP Govt