జ్ఞాపక చిహ్నాలు …!!

2023-05-15 11:02:30.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/15/764054-jnapaka.webp

గుడిసెలు కాలిపోతుంటే

అగ్నిమాపక కేంద్రం

గుర్తుకు వస్తుంది!

నీటి ఎద్దడి వస్తే

చెరువుల

మరమ్మత్తులు

గుర్తుకు వస్తాయ్!

కుక్కకాటు సంఘటనలు

ఎక్కువైతే

ఆంటీ రేబిస్ మందులు

గుర్తుకు వస్తాయి!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో

రాజకీయ నాయకులు

అడుగు పెడితేనే ….

మందుల కొరత

సిబ్బంది కొరత

సదు పాయాల కొరత

గుర్తుకు వస్తుంది!

అవసరాలను

గుర్తించడం,

ముందస్తు జాగ్రత్తలు

తీసుకోడం,

మనం

సాధించలేని అంశాలా?

ఆలోచించి చూడండి

సాధ్యం చేసి చూపించండి.!!

– డా.కె.ఎల్.వి.ప్రసాద్.

Jnapaka Chihnalu,Dr KLV Prasad,Telugu Kavithalu