జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

2022-06-24 07:23:49.0

ఆర్చరీ స్టార్ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ వెన్నంకు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలిపింది. గ్రూప్-1 హోదాలోని డిప్యుటీ కలెక్టర్ పోస్టును ఆమెకు ఇవ్వడానికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. భారత మహిళా స్టార్ ఆర్చర్లలో ఒకరైన జ్యోతి సురేఖ ఇటీవల అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తోంది. ప్రతిష్టాత్మక ఈవెంట్లలో అనేక పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని […]

ఆర్చరీ స్టార్ ప్లేయర్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖ వెన్నంకు ఏపీ ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ మేరకు ఆమోదం తెలిపింది. గ్రూప్-1 హోదాలోని డిప్యుటీ కలెక్టర్ పోస్టును ఆమెకు ఇవ్వడానికి మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. భారత మహిళా స్టార్ ఆర్చర్లలో ఒకరైన జ్యోతి సురేఖ ఇటీవల అంతర్జాతీయంగా నిలకడగా రాణిస్తోంది.

ప్రతిష్టాత్మక ఈవెంట్లలో అనేక పతకాలు గెలిచి దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసింది. ఇటీవల అమెరికాలో జరిగిన ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో మూడు రజత పతకాలు సాధించింది. కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకుంటున్న సమయానికి జ్యోతి ప్యారీస్‌లో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3‌లో పతకం ఖాయం చేసుకున్నది. శుక్రవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ సెమీస్‌లో అభిషేక్ వర్మతో కలసి జ్యోతి ఆడింది. ఏడో సీడ్ ఏస్తోనియా మీద జరిగిన మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకొని పతకం ఖాయం చేసుకున్నారు. శనివారం ఈ జోడి ఫ్రెంచ్ జోడీ మీద గెలిస్తే స్వర్ణ పతకం ఖాయం అవుతుంది.

విజయవాడకు చెందిన మాజీ కబడ్డీ ప్లేయర్, వెటర్నరీ డాక్టర్ వెన్నం సురేంద్ర కుమార్, శ్రీ దుర్గ దంపతులకు జ్యోతి 1996లో జన్మించింది. నాలుగేళ్ల వయసులోనే కృష్ణా నదిని మూడు సార్లు ( 5 కిలోమీటర్లు) కేవలం 3 గంటల 20 నిమిషాల్లో ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. చిన్నప్పుడే ఆర్చరీని ప్రొఫెషనల్ కెరీర్‌గా మార్చుకున్న జ్యోతి.. 13 ఏళ్ల వయసులో మెక్సికన్ గ్రాండ్ ప్రీలో స్వర్ణం గెలిచింది. 2011 ఆసియన్ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో రెండు కాంస్య పతకాలు గెలిచింది. 2017లో కేంద్ర ప్రభుత్వం ఆమెను అర్జున అవార్డుతో సక్కరించింది. దక్షిణాదికి చెందిన క్రీడాకారుల్లో అర్జున అవార్డు గెలిచిన అతి చిన్న వయసు అథ్లెట్‌గా రికార్డులకు ఎక్కింది.

 

ఆర్చరీ స్టార్ ప్లేయర్,ఏపీ ప్ర‌భుత్వ,జ్యోతి సురేఖ,డిప్యుటీ కలెక్టర్ పోస్టు,భారత మహిళా స్టార్,వైఎస్ జగన్