ఝార్ఖండ్‌లో ప్రారంభమైన తొలి విడత పోలింగ్‌

2024-11-13 04:20:52.0

దీంతోపాటు దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377298-jharkhand.webp

ఝార్ఖండ్‌లో మొదటి విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఝార్ఖండ్‌లో 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరుగుతున్నది. 683 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్‌ కోసం 15,344 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 1.37 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడుతలో ప్రధాన అభ్యర్థుల్లో మాజీ సీఎం చంపయీ సోరెన్‌, కాంగ్రెస్‌ నేత బన్నా గుప్తా, రాజ్యసభ సభ్యుడు మహువా మాఝీ, మాజీ సీఎం మధు కోడా సతీమణి గీతా కోడా, మాజీ సీఎం రఘుబర్‌దాస్‌ కోడలు పూర్ణిమా దాస్‌ ఉన్నారు.

మరోవైపు ప్రియాంకా గాంధీ బరిలో ఉన్న కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నేడు పోలింగ్‌ జరుగుతున్నది. దేశవ్యాప్తంగా 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉప ఎన్నికలను ఎన్నికల సంగం మొదట ప్రకటించింది. సిక్కింల్‌లో సిక్కిం క్రాంతికారి మోర్చా 2 నియోజకవర్గాలను ఏకగ్రీవంగా గెలుచుకున్నది. దీంతో నేడు 31 చోట్ల పోలింగ్‌ జరుగుతున్నది. “నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత ఓటింగ్. ఈ ప్రజాస్వామ్య పండుగలో పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ఓటర్లందరినీ కోరుతున్నాను’’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. 

Jharkhand Assembly Elections,First phase,31 Assembly,One Lok Sabha,By-elections