2024-10-28 10:16:45.0
హేమంత్ సోరెన్‌పై తమ అభ్యర్థిగా గమాలియల్‌ను బరిలోకి దింపిన బీజేపీ
https://www.teluguglobal.com/h-upload/2024/10/28/1373274-hemanth.webp
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. జేఎంఎం అధ్యక్షుడు సీఎం హేమత్ సోరెన్ పోటీ చేస్తున్న బర్హైత్ నుంచి బీజేపీ తమ అభ్యర్థి గా గమాలియల్‌ను బరిలోకి దింపింది. 2019లో బర్హైత్ నుంచి అల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ పార్టీ తరఫున పోటీ చేసిన గమాలియల్‌కు 2, 573 ఓట్లు వచ్చాయి. 81 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 68 చోట్ల పోటీ చేస్తున్నది. మిగతా స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడుతల్లో భాగంగా నవంబర్ 13, 20 తేదీల్లో జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనున్నది.
Jharkhand Assembly polls,BJP releases second list,Gamaliyal Hembrom,Contest against,Hemant Soren Barhait constituency