ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసే నాలుగు పథకాలను మార్చి 31వరకు అమలు చేస్తామన్న సర్కార్
సీఎం రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే రోజున కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఇవాళ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రైతుభరోసా పైసలు రైతుల ఖాతాల్లో ‘టకీ టకీ’ మని పడుతాయన్నారు. ముఖ్యమంత్రి గంటలోనే మార్చారు. కొత్తగా ప్రారంభించిన పథకాలన్నీ మార్చి 31 వరకు అందుతాయన్నారు. ఎన్నిలకు ముందు ఇప్పుడు తీసుకుంటే రైతు బంధు రూ. 10 వేలే వస్తాయి.. అదే నెలరోజుల తర్వాత అయితే రూ. 15 వేలు వస్తాయన్నారు. ఇట్లా బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందిస్తున్న నగదు కంటే చిట్టిపాటలో పాడినట్టు డబుల్ చేసి చెప్పారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. వందరోజులు పోయాయి. పదిహేను నెలలు కావొస్తున్నా పథకాలన్నీ ముఖ్యమంత్రి మాటల్లోనే అమలయ్యాయి.
రైతుభరోసా సంగతి ఏమో గాని కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు పైసలైనా ఇవ్వాలని రైతులు రోడ్లెక్కారు. లేదు గత ప్రభుత్వం రైతు బంధు పైసలు దుర్వినియోగం చేసిందని, తాము నిజంగా వ్యవసాయం చేసే రైతులకే ఇస్తుందని నమ్మబలికి ఒక టర్న్ ఎగ్గొట్టింది. దీనిపై రైతులు, ప్రతిపక్షాలు నిలదీయడంతో రైతుభరోసాపై ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ముక్తసరి ప్రకటన చేశారు. మేము చెప్పిన ఏడాదికి ఎకరానికి రూ. 15 వేలు ఇవ్వలేము గాని, రూ. 12 వేలతో సరిపెట్టుకోవాలన్నారు. సరే ఆ పైసలన్నా ఇవ్వండి అని అడిదితే జనవరి 26 డెడ్‌లైన్ పెట్టారు. ఇక జనవరి 26న ప్రతిష్టాత్మక నాలుగు పథకాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటనలు, హోర్గింగులు, సభలు పెట్టి ప్రసంగాలు దంచారు. సీఎం చెప్పిన టకీ టకీ తుపేల్ ముచ్చటేనని తేలిపోయింది. అయితే ప్రజలకు అబద్ధాలే చెప్పాలని, మాటలతో నమ్మించి మోసం చేయాలి అన్నది సీఎం రేవంత్‌రెడ్డికి అలవాటే. ఆయన విధానమూ అదే. అందుకే పొద్దున్న చెప్పిన టకీ టకీ మాట మధ్యాహ్నం వరకే మాయమైంది. మార్చి 31కి చేరింది. రేవంత్ రెడ్డి మళ్లీ వాయిదా ఎందుకు వేశారంటే ఇదంతా ఒక పథకం ప్రకారమేనని ఇవాళ అందరికీ అర్థమైంది.
ఎందుకంటే తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వీటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నది. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఫిబ్రవరి 27 పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనున్నది. ఎన్నికల్లో జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ మినహా మిగిలిన ఏడు జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ఆ నాలుగు పథకాల అమలుకు బ్రేక్ తప్పదు. కోడ్ కారణంగా మేము పథకాలు అందించలేకపోతున్నామని ఒక ప్రకటన చేసి చేతులు దులుపుకోవచ్చని రేవంత్ సర్కార్ వేసిన ప్లాన్ ఇది.
CM Revanth Reddy,Rythu Bharosa Fund,Farmers,Govt To Start Four Schemes On 26th Jan- Rythu Bharosa,Ration Cards,Indiramma Illu