టాలీవుడ్ నటుడుపై కేసు నమోదు

 

2024-11-26 08:56:03.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381018-sriteja.webp

ప్రముఖ సినీ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.

టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌పై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ మేరకు పోలీసులు శ్రీతేజ్‌పై బీఎన్‌ఎస్ 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నధికారి భర్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయం తెలిసి గుండెపోటుతో మహిళ భర్త మృతి చెందాడు.

బ్యాంక్‌ ఉద్యోగి మృతితో గతంలో మాదాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, పుష్ప ది రైజ్‌, మంగళవారం, ధమాకా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీతేజ్‌ ప్రస్తుతం పుష్ప ది రూల్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాల్లో చంద్రబాబు గెటప్‌లో శ్రీతేజ్ నటించాడు

 

Tollywood,Actor Shritej,Kukatpally Police Station,Vangaveeti,Lakshmi’s NTR,Pushpa The Rise,Chandrababu,Madapur