https://www.teluguglobal.com/h-upload/2025/01/20/1396075-ranag-raju.webp
2025-01-20 09:50:46.0
సీనియర్ నటుడు విజయ్ రంగరాజు తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ రంగారాజు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. బాలకృష్ణ నటించిన భైరవద్వీపంలో పాపులర్ అయ్యారు. తర్వాత యజ్ఞం. సిమశాస్త్రీ, జాంబిరెడ్డి, ఢమరుకం, శ్లోకం, మగరాయుడు, విశాఖ ఎక్స్‌ప్రెస్, మేడం సహా పలు సినిమాల్లో విజయ రంగారాజు నటించారు.ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విజయ్ రంగరాజు పుట్టింది పూణెలో. పెరిగింది ముంబైలో. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత రంగరాజు గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.
Actor Vijay Rangaraju,Chennai,Bhairavadweep,Yajna,Simasastri,Tollywood,Mumbai