2025-02-06 08:15:48.0
హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనున్నది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. టీమిండియాను బౌలింగ్‌కు ఆహ్వానించింది. హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నారు. హర్షిత్ రాణా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకోవడంతో వన్డే జట్టులోనూ చోటు దక్కింది.
టీ20 సిరీస్‌న 4-1 తేడాతో గెలుచుకున్న భారత్.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించి కప్పు సాధించాలనే పట్టుదలతో ఉన్నది. మరోవైపు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫికి ముందు ఎలాగైనా వన్డేల్లో సత్తా చాటాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం లేదని తెలిపారు. మోకాలి గాయంతో బాధపడుతున్నాడని.. అందుకే మ్యాచ్‌కు దూరమైనట్లు తెలిపాడు.
India vs England,1st ODI at Nagpur,IND vs ENG,Harshit Rana,Virat Kahili