టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

2025-03-02 09:13:06.0

గ్రూప్‌-ఏలో ఇది ఆఖరి మ్యాచ్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీలో మరో ఆసక్తికర మ్యాచ్‌కు వేళ అయ్యింది. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీలోకి అడుగుపెట్టాయి. గ్రూప్‌-ఏలో ఇది ఆఖరి మ్యాచ్‌. దీని ఫలితం గ్రూప్‌ టాపర్‌తో పాటు సెమీస్‌ ప్రత్యర్థులను నిర్ణయించనున్నది. భారత్‌ 13వ సారి టాస్‌ ఓడిపోయింది. అందులో కెప్టెన్‌ రోహిత్‌ 10 సార్లు టాస్‌ కోల్పోవడం గమనార్హం. వన్డేల్లో ఇలా అత్యధిక టాస్‌ను కోల్పోయిన మూడో సారథిగా రోహిత్‌ నిలిచాడు. రోహిత్‌ కంటే ముందు బ్రియాన్‌ లారా (12 సార్లు) పీటర్‌ బోరెన్‌ (11 సార్లు) ఉన్నారు. ఇక స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీకి ఇది 300 వన్డే. ఓపెన్లుగా రోహిత్‌ శర్మ, శుభహమన్‌ గిల్‌ రాగా..మ్యాట్‌ హెన్రీ కివీస్‌ బౌలింగ్‌ మొదలుపెట్టాడు. 

India vs New Zealand,12th Match,Group A at Dubai,Champions Trophy,Mar 02 2025