టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

2025-02-09 08:00:09.0

కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వన్డేలో దూరమైన విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. వరుణ్ చక్రవర్తి వన్డేలోకి అరంగేట్రం చేస్తున్నారు. టీమిండియా. జైస్వాల్ స్థానంలో విరాట్ కోహ్లీ, కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తి జట్టులో చోటు దక్కించుకున్నారు. మొదటి మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా బాగుందన్నారు కెప్టెన్ రోహిత్ శర్మ. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యార్, అక్షర్ పటేల్ చక్కగా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించామన్నారు. జట్టులో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు.

ఇంగ్లండ్ తుది జట్టు

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్‌సన్, అదిల్ రషీద్, మార్క్‌ వుడ్, సకిబ్ మహమూద్

భారత తుది జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, షమీ, వరుణ్‌ చక్రవర్తి

England,Second ODI,Virat Kohli,Captain Rohit Sharma,Shubman Gill,Varun Chakraborty,Philip Salt,Jose Butler,Akshar Patel