http://www.teluguglobal.com/wp-content/uploads/2016/02/indian-tv.png
2016-02-18 06:59:35.0
టివికి ఇడియట్ బాక్సనే పేరుంది కదా. ఎక్కువ సమయం దానిముందు గడిపితే వచ్చే నష్టాలు తెలుసుకుంటే దానికి ఆ పేరు సరిగ్గా సరిపోతుందని అర్థమవుతుంది. అయితే కోరి కోరి ఆ నష్టాలను తెచ్చుకుంటాం కనుక మనం అంతకంటే పెద్ద ఇడియట్స్మి అని కూడా అనిపిస్తుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్, 11వేలమంది ఆస్ట్రేలియన్ల మీద అధ్యయనం చేసి ఈ విషయంపై కొన్ని నిజాలను వెల్లడించింది. అవే ఇవి- పెద్దవాళ్లు తాము టివి చూస్తున్న ప్రతి గంట […]
టివికి ఇడియట్ బాక్సనే పేరుంది కదా. ఎక్కువ సమయం దానిముందు గడిపితే వచ్చే నష్టాలు తెలుసుకుంటే దానికి ఆ పేరు సరిగ్గా సరిపోతుందని అర్థమవుతుంది. అయితే కోరి కోరి ఆ నష్టాలను తెచ్చుకుంటాం కనుక మనం అంతకంటే పెద్ద ఇడియట్స్మి అని కూడా అనిపిస్తుంది. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్ మెడిసిన్, 11వేలమంది ఆస్ట్రేలియన్ల మీద అధ్యయనం చేసి ఈ విషయంపై కొన్ని నిజాలను వెల్లడించింది. అవే ఇవి-
- పెద్దవాళ్లు తాము టివి చూస్తున్న ప్రతి గంట కాలానికి, తమ అంచనా జీవితకాలంలోంచి 22 నిముషాలను కోల్పోతున్నట్టేనట.
- రోజంతటిలో ఆరుగంటలు టివి ముందు గడిపేవారు, టివి చూడని తమ తోటివారికంటే ఐదేళ్లు ముందుగా జీవితాన్ని ముగించే ప్రమాదం ఉందట.
- అయితే ఈ ప్రమాదమంతా కేవలం టివి చూడటం వలన వచ్చేది కాదు, ఏ పనీలేకుండా, శరీరంలో చురుకుదనం లేకుండా స్థబ్దుగా ఉండటం వలన జరిగే నష్టమది.
- కదలకుండా ముప్పయి నిముషాలు కూర్చుంటే ఆ తరువాత నుండి మన శరీరం, కణాల్లో షుగర్‌ని నింపడం మొదలుపెడుతుందట. దీనివలన ఓవర్ వెయిట్‌తో పాటు అనేక సమస్యలు వస్తాయి.
- టివి ముందయినా, పనిచేస్తున్న డెస్క్ ముందయినా గంటల తరబడి కూర్చునేవారు గుర్తుపెట్టుకుని, ప్రతి అరగంటకు ఒకసారి లేచి కాస్తదూరమైనా నడవాలని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు.
Health Problems Watching TV,Television,TV
https://www.teluguglobal.com//2016/02/18/health-problems-watching-too-much-tv/