టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తాం

2024-09-21 12:33:49.0

ఈవోకు లేఖ రాసిన విజయ డెయిరీ

తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌ శనివారం టీటీడీ ఈవో శ్యామలరావుకు లేఖ రాశారు. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో దేశంలోనే విజయ డెయిరీ ప్రసిద్ధి చెందినదని, నాణ్యమైన ఉత్పత్తులు సరఫరా చేసిన చరిత్ర తమ సొంతమని లేఖలో పేర్కొన్నారు. టీటీడీకి అవసరమైన నాణ్యమైన నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు సరఫరా చేయడానికి విజయ డెయిరీ సిద్ధంగా ఉందని తెలిపారు. తమ ఉత్పత్తుల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకత ఉంటుందని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి విజయ డెయిరీ సిద్ధమైంది. ఈక్రమంలోనే టీటీడీ ఈవోకు లేఖ రాసింది.

 

Tirumala Tirupati Devastanam,Srivaari laddu prasadam,ghee,ghee purity issue,vijaya dairy,Telangana