టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం

2024-11-06 05:14:46.0

ఛైర్మన్‌, 16 మంది పాలక మండలి సభ్యులతో ప్రమాణం చేయించిన ఈవో శ్యామలరావు

https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375192-br-naidu.webp

టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బీఆర్‌ నాయుడు, 16 మంది పాలక మండలి సభ్యులతో ఈవో శ్యామలరావు ప్రమాణం చేయించారు. మొదట టీటీడీ ఛైర్మన్‌కు ఆలయ మహాద్వారం వద్ద అడిషనల్‌ ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి ఆలయం లోపలికి వెళ్లిన ఆయన.. భూవరాహస్వామిని దర్శించుకున్నారు. 

అనంతరం బీఆర్‌నాయుడు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశ్వీర్వచనం ఇచ్చారు. ఈవో శ్యామలరావు బీఆర్‌ నాయుడు దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. మరోవైపు ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల అనంతరం టీటీడీ పాలక మండలి తిరుమలలో కొలువు తీరింది.