టీడీపీలోకి మాజీ మంత్రి ఆళ్ల నాని

2025-02-13 17:11:36.0

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు

https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403217-alla-nani-tdp.webp

మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీలో చేరారు. ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కండువా కప్పి నానిని పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరుకు చెందిన ఆళ్ల నాని కొన్నాళ్ల క్రితం వైసీపీని వీడారు. కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.