https://www.teluguglobal.com/h-upload/2024/02/18/1298942-ravichandran-ashwin-back-india-spinner-to-rejoin-team-in-rajkot-on-day-4-of-3rd-test-against-england.webp
2024-02-18 07:40:14.0
టెస్ట్‌ల్లో 500 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు సృష్టించిన రెండో రోజు ఆట ఆడకుండానే ఇంటికి వెళ్లిపోయాడు.
మూడో టెస్ట్ విజయంపై కన్నేసిన టీమిండియాకు గుడ్ న్యూస్. కుటుంబంలో ఎమర్జెన్సీ అవసరం రీత్యా మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయిన ఏస్ స్పిన్నర్ అశ్విన్ తిరిగి జట్టుతో కలవబోతున్నాడు. ఈరోజే అతను టీమ్‌తో కలుస్తాడని బీసీసీఐ ప్రకటించింది.
500 వికెట్లు తీసి వెంటనే ఇంటికి
టెస్ట్‌ల్లో 500 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్‌గా తొలి ఇన్నింగ్స్‌లో రికార్డు సృష్టించిన రెండో రోజు ఆట ఆడకుండానే ఇంటికి వెళ్లిపోయాడు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి నేపథ్యంలో సడన్‌గా అతను వెళ్లిపోవడంతో మిగిలిన బౌలర్లు భారం మోశారు. సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అందరూ తలోచేయి వేయడంతో ఇంగ్లాండ్ వెంటనే ఆలౌటయింది.
ఇక గెలుపు పక్కా
ఇప్పటికే 450 పరుగుల ఆధిక్యంతో దూసుకుపోతున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. ఇంగ్లాండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో ఆడినా గెలవడానికి ఈ స్కోరు సరిపోతుంది. అశ్విన్ కూడా తిరిగి వచ్చేస్తుండటంతో ఇక గెలుపు పక్కా అని అభిమానులు ఖుషీగా ఉన్నారు.