టీమిండియా టార్గెట్‌ 147 రన్స్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/03/1374461-jadeja.webp

2024-11-03 04:46:07.0

న్యూజిలాండ్‌ 174 రన్స్‌కు ఆలౌట్‌, రవీంద్ర జడేజాకు 5 వికెట్లు

 

భారత్‌ తో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 174 రన్స్‌కు ఆలౌటైంది. టీమిండియాకు 147 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. విల్‌ యంగ్‌ (51) ఒక్కడే రాణించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, రవిచంద్రన్‌ అశ్విన్‌ 3 వికెట్లు తీయగా.. ఆకాశ్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 28 రన్స్‌ ఆధిక్యం లభించిన విషయం విదితమే. ఓవర్‌నైట్‌ 171/9 స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ మరో మూడు రన్స్‌ మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా (5/55) బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన అజాజ్‌ పటేల్‌ (8) బౌండరీ లైన్‌ వద్ద ఆకాశ్‌దీప్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో జడేజా రెండు ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం గమనార్హం.మొదటి ఇన్సింగ్స్‌లో కివీస్‌ 235, భారత్‌ 263 రన్స్‌ చేసిన సంగతి తెలిసిందే.