టీ 20 వరల్డ్‌ కప్‌.. తడబడుతున్న పాక్‌ బ్యాటర్లు

https://www.teluguglobal.com/h-upload/2024/10/06/1366713-india-vs-pak-new.webp

2024-10-06 10:49:39.0

మూడు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు

 

టీ 20 ఉమెర్‌ వరల్డ్ కప్‌ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ తో తలపడుతున్న భారత జట్టు బౌలింగ్‌ లో అద్భుతంగా రాణిస్తోంది. టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ ను పవర్‌ ప్లేలోనే దెబ్బకొట్టింది. పాక్‌ బ్యాటర్లు 8.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేశారు. దుబయిలో జరుగుతోన్న మ్యాచ్‌ లో ఓపెనర్‌ గుల్‌ ఫిరోజాను ఫస్ట్‌ ఓవర్‌లోనే రేణుకా సింగ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశారు. ఫస్ట్‌ డౌన్‌ లో వచ్చిన సిద్రా అమిన్‌ ను దీప్తి శర్మ బౌల్డ్‌ చేశారు. ఓమైనా సొహైల్‌ 3 పరుగులు చేసి అరుందతి రెడ్డి బౌలింగ్‌ లో షఫాలి వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ఓపెనర్‌ ముబీనా అలీ ఏడో ఓవర్‌ లో క్యాచ్‌ ఇచ్చినా లెగ్‌ స్లిప్‌ లో డ్రాప్‌ చేయడంతో బతికి పోయారు. ముబీనా అలీ 17, నిదా దార్‌ ఆరు పరుగులతో క్రీజ్‌ లో ఉన్నారు.