http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/tooth-paste-back-strip.gif
2016-07-05 03:03:46.0
వస్తువు ప్యాకెట్‌మీద ఉన్న రంగులు ఆయా ఉత్పత్తుల్లో ఏమున్నాయి… అనేది వినియోగదారుడికి చెబుతాయా…ఈ విషయం మీద చాలా కాలంగా పలురకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో టూత్పేస్ట్ ప్యాకింగుకి అడుగున చతురస్రాకారంలో కనబడుతున్న రంగు…ఆ పేస్ట్ ఏఏ పదార్థాలు, రసాయనాలతో తయారయింది… అనేందుకు సూచన అని, వినియోగదారులకు ఇదొక టిప్ అని ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతుంది. ఆ చతురస్రం నీలం రంగులో ఉంటే పేస్ట్లో ప్రకృతి సహజ పదార్థాలు , ఔషధాలు ఉన్నాయని, ఆకుపచ్చరంగులో ఉంటే పూర్తిగా ప్రకృతి సహజమైన […]
వస్తువు ప్యాకెట్‌మీద ఉన్న రంగులు ఆయా ఉత్పత్తుల్లో ఏమున్నాయి… అనేది వినియోగదారుడికి చెబుతాయా…ఈ విషయం మీద చాలా కాలంగా పలురకాల వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలో టూత్పేస్ట్ ప్యాకింగుకి అడుగున చతురస్రాకారంలో కనబడుతున్న రంగు…ఆ పేస్ట్ ఏఏ పదార్థాలు, రసాయనాలతో తయారయింది… అనేందుకు సూచన అని, వినియోగదారులకు ఇదొక టిప్ అని ఇంటర్నెట్లో ప్రచారం జరుగుతుంది.
ఆ చతురస్రం నీలం రంగులో ఉంటే పేస్ట్లో ప్రకృతి సహజ పదార్థాలు , ఔషధాలు ఉన్నాయని, ఆకుపచ్చరంగులో ఉంటే పూర్తిగా ప్రకృతి సహజమైన పదార్థాలతో తయారయిందని అర్థమని, ఎరుపు ఉంటే ప్రకృతి సహజమైన వాటితో పాటు అందులో రసాయనాలు సైతం కలిసి ఉంటాయని, నలుపు రంగు మార్క్ ఉంటే కేవలం రసాయనాలను మాత్రమే ఉపయోగించి తయారుచేశారని అర్థమని….వివరణలు కనబడుతున్నాయి. అయితే దీనిపై నిజానిజాలను గురించి చెప్పాలంటే – ఈ రంగురంగుల గుర్తులకు అందులో ఉన్న పదార్థాలకు ఎలాంటి సంబంధం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
వీటిని ప్యాకింగ్ ఉత్పత్తుల యూనిట్లలో కొన్ని గుర్తులకోసం వినియోగిస్తారు. వీటిని ఐమార్క్స్ అని కూడా అంటారు. అత్యంత వేగంగా పనిచేసే ఎలక్ట్రానిక్ మిషనరీతో ప్యాకెట్లు తయారవుతున్నపుడు వాటిని ఎక్కడ కట్చేయాలి, ఎక్కడ ఫోల్డ్ చేయాలి అనేది కాంతికిరణాల సెన్సార్లు గుర్తించడానికి వీలుగా ఇలాంటి రంగుల గుర్తులను వినియోగిస్తారు. అంతేతప్ప ఉత్పత్తుల్లో ఉన్న పదార్థాలకు, రసాయనాలకు ఈ రంగులకు ఎలాంటి సంబంధం లేదు. అందులో వాడినవాటిని గురించి తెలుసు కోవాలంటే ప్యాకింగుమీద ఉన్న సమాచారాన్ని చూసి తెలుసుకోవాల్సిందే.
back strip,back strip colour,tooth paste,tooth paste back strip
https://www.teluguglobal.com//2016/07/05/tooth-paste-back-strip-tg/