టెట్‌ ఫలితాలు విడుదల

2025-02-05 12:18:09.0

అర్హత సాధించింది 31.21 శాతం మంది మాత్రమే

టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (టెట్‌) ఫలితాలను తెలంగాణ పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. పేపర్‌ -1, 2లకు మొత్తం 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా 1,35,802 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వారిలో 42,384 మంది అర్హత సాధించారని అధికారులు వెల్లడించారు. పరీక్షకు హాజరైన వారిలో 31.21 శాతం మంది ఎలిజిబులిటీ సాధించారని తెలిపారు. టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షలో టెట్‌ స్కోర్‌ కు 20 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఒకసారి టెట్‌ పరీక్షలో అర్హత సాధిస్తే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.

Telangana TET,Result Released,31.21 % Qualified,School Education Department