2024-11-09 13:00:48.0
https://www.teluguglobal.com/h-upload/2024/11/09/1376353-big-boss.webp
ఎవిక్షన్ టాస్క్ ఫెయిల్యూర్‌పై అసహనం వ్యక్తం చేసిన నాగార్జున
బిగ్‌బాస్ సీజన్-8లో మరో వీకెండ్ వినోదాలను పంచడానికి సిద్ధమైంది. వారమంతా హౌస్‌మేట్స్ చేసిన తప్పొప్పులను సమీక్షించడానికి వ్యాఖ్యాత నాగార్జున సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఎవిక్షన్ టాస్క్ ఫెయిల్యూర్‌పై మాట్లాడుతూ..ఎవిక్షన్ టాస్క్ ఫెయిల్ అవడానికి ఒక వ్యక్తి కారణం. టాస్క్ రూల్స్ తెలియవా? టాస్క్ ఏమిటి? అని అడగగా తేజ ఏదో చెప్పబోయాడు. మీరిద్దరు ఒక అభిప్రాయానికి రాకుండా వ్యక్తిగతంగా ఎలా ఆడావు? అని టేస్టీ తేజాను నిలదీశారు నువ్వు చేసిన తప్పుకు ఫలితం ఏమిటో తెలుసా అన్నారు. టేస్టీ తేజపై నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. నిఖిల్, రోహిణి, నబీల్‌లో ఎవరు ఎవిక్షన్ షీల్డ్‌కు అర్హులో చెప్పమని మిగిలిన కంటెస్టులను నాగార్జున కోరారు. హౌస్‌మేట్స్ ముగ్గురిలో ఒక్కొక్కరు ఒకరిని ముందుకు తీసుకొచ్చారు. అందరికీ సమానంగా ఓట్లు వచ్చాయి. మరి ఈ షీల్డ్ ఎవరికి దక్కుతుందో చూడాలి.
Bigg Boss Telugu 8,Day 69 Promo,Eviction Task Failure,Nagarjun,Tasty Teja