#ట్రంపుకుతింటున్నట్టున్నాడు

2023-01-30 04:57:29.0

https://www.teluguglobal.com/h-upload/2023/01/30/721247-demonetization.webp

నోట్ల రద్దు సమర్ధించిన కొందరు సహవాసులు, కొందరు ప్రవాసుల మీద వ్రాసిన కవిత 30-01-2017

కంపు ఊహించిన దానికంటే

ముందే మొదలయింది

నోట్ల రద్దు దెబ్బకి వృద్ధులు లైన్లో

నిలబడి క్యూ కట్టి మరీ చచ్చిపోతే

కాస్త ఓర్చుకోమని చెప్పేవాళ్ళకి

కష్టం తెలియకపోవచ్చేమో

కానీ… కట్టు తెంపుకున్న

ట్రంపు గుంపు

ట్రంపరితనాన్ని చూసి ఇక్కడి వాళ్ళు

మనసు కష్టపెట్టుకుంటున్నారే తప్ప

ఆవలి తీరం నుంచీ

“ఆహా మోడీ… ఓహో మోడీ …”

అన్నంత ఈజీగా పొగడ్తల వర్షం

ఏవగింపుగా కురిపించడం లేదు

ఊరూరికీ, పేట పేటకీ,

రాష్ట్రం రాష్ట్రానికీ అధికార

దాహార్తిని తీర్చుకోడానికి

అర్థ సత్యాలూ, అసత్యాలూ

వల్లేవేస్తూ , విధానాల విన్యాసం

అనుక్షణం ఊసరవెల్లిని

సిగ్గుపడేలా చేసిన, చేస్తున్న

వాళ్ళని ఇంకా ఎక్సోటిక్ గా మోస్తున్న

వాళ్ళ కష్టాలు చూసి మాత్రం

పుట్టింట్లో ఎవరూ చంకలు

తట్టుకోవడం లేదు…

భావి బంధనాలు

తలుచుకుని కన్నీరు పెడుతున్నారు

కాకపోతే…

ఎగ్జిబిషనిజం చేతకాని

ఎర్రిబాగులోళ్ళు కాబట్టి

తమ ఆవేదనని మనసులోనే

మూటగట్టి మూతపెట్టేస్తున్నారు

“రైట్ రైట్ ” అని ఏరు దాటాక అరవడం అనాలోచిత చర్య అని

ఇప్పటికైనా గుర్తెరిగితే

అదే పది వేలు …

సారీ పది మిలియన్లు

మీ కష్టానికి మేం తోడుంటాం

ఆచంద్రతారార్కం

అవసరమైతే అక్కున చేర్చుకుంటాం

చాలా మంది నొచ్చుకోవచ్చు

కానీ ఇది చేదు నిజం

మనకి మనం తోడుండటం మన నైజం

– సాయి శేఖర్

Saye Sekhar,Telugu Kavithalu