ట్రంప్‌ గెలుపు.. మస్క్‌ ఆమ్దానీకి మస్త్‌ జోష్‌

2024-11-07 08:16:05.0

ఒక్క రోజులోనే రూ.2 లక్షల కోట్లు పెరిగిన ఎలన్‌ మస్క్‌ సంపద

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నకు బాహాటంగానే మద్దతు ప్రకటించిన టెస్లా అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్‌ మస్క్‌ కు ఎన్నికల ఫలితాలు మస్త్‌ జోష్‌ ఇచ్చాయి. ట్రంప్‌ గెలుపుతో ఆయనలో హుషారు పెరగడమే కాదు ఆమ్దానీ కూడా భారీగానే పెరిగింది. ఎలన్‌ మస్క్‌ అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. ట్రంప్‌ గెలుపు కోసం ఆయన ఎంతో పని చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుతో స్టాక్‌ మార్కెట్లు ఉరకలెత్తాయి. దీంతో మస్క్‌ ఆదాయం ఒక్క రోజులోనే 26.5 బిలియన్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ.2 లక్షల కోట్లు) పెరిగింది. మస్క్ నికర సంపద 290 బిలియన్‌ డాలర్లకు చేరిందని బూమ్‌ బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకటించింది. అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ సంపద 7.14 బిలియన్‌ డాలర్లు (రూ.60 వేల కోట్లు) పెరిగి 228 బిలియన్‌ డాలర్లకు చేరిఇంది. ఒరాకిల్‌ కో ఫౌండర్‌ లారీ ఎలిసన్‌, ప్రముఖ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ సంపద కూడా పెరిగింది.

America Presidential Election,Donald Trump,Elon Musk,Income Boom,Republican Party