2024-11-06 09:02:05.0
‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అని ఎక్స్‌లో రాసుకొచ్చిన ప్రపంచకుబేరుడు
అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ విస్తృతంగా ప్రచారం చేశారు. తాజాగా ట్రంప్ విజయం దిశగా పయనిస్తుండటంతో ఫలితాలు వెలువడుతున్న క్రమంలో మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘గేమ్ సెట్ అండ్ మ్యాచ్’ అని రాసుకొచ్చారు. టెన్నిస్ మ్యాచ్ తర్వాత ఈ పదాలను ఉపయోగిస్తుంటారు. 2024 US అధ్యక్ష ఎన్నికల విజయాన్ని అంచనా వేసిన డొనాల్డ్ ట్రంప్‌ను ఎలోన్ మస్క్ అభినందించారు. ఈ విజయాన్ని అనివార్యంగా ,దేశం మార్పు కోసం అని పేర్కొన్నారు.
ట్రంప్ గెలిస్తే ఫెడరల్ ఏజెన్సీల సంఖ్య తగ్గించాలని సూచిస్తానని వెల్లడించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ (270) మూడు సీట్ల దూరంలో డొనాల్డ్ ట్రంప్ (267) ఉన్నారు. 538 ఎలక్ట్రోరల్ ఓట్లలో కమలా హారిస్ 224 గెలుచుకున్నారు. కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం సాధించారు.
Donald Trump,US presidential election victory,Elon Musk React,Clear mandate,Inevitable