2022-05-13 06:09:14.0
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్ల(3.3 లక్షల కోట్ల రూపాయల పైగా)) ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని, ఆ లెక్కలు తేలేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు. డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు 5 శాతం వరకు ఉండొచ్చని ట్విట్టర్ అంచనా […]
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 44 బిలియన్ డాలర్ల(3.3 లక్షల కోట్ల రూపాయల పైగా)) ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ట్విటర్ యూజర్లలో ఉన్న స్పామ్ లేదా ఫేక్ అకౌంట్లకు సంబంధించిన లెక్కలు అందాల్సి ఉందని, ఆ లెక్కలు తేలేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ఆయన తెలిపారు.
డైలీ యాక్టివ్ యూజర్లలో స్పామ్ లేదా నకిలీ వినియోగదారులు 5 శాతం వరకు ఉండొచ్చని ట్విట్టర్ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన వివరాలు అందించలేదని మస్క్ చెబుతున్నారు. ఎలాన్ మస్క్ చేసిన ఈ ప్రకటనతో ట్విటర్ షేర్లు శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో ఏకంగా 20 శాతం మేర భారీగా పతనమయ్యాయి. ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 17.7% క్షీణించి $37.10కి పడిపోయాయి.
ఎలన్ మస్క్ ప్రకటన పై స్పందించాలని మీడియా చేసిన అభ్యర్థనకు ట్విట్టర్ ఇప్పటి వరకు స్పందించలేదు.
కాగా ఎలాన్ మస్క్‌తో ఒప్పందం అయిపోయే లోపు తమకు అనేక ప్రమాదాలు పొంచివున్నాయని ట్విట్టర్ కొద్ది రోజుల క్రితమే ఆందోళన వెలిబుచ్చింది. అప్పటి దాకా ప్రకటనదారులు తమతోనే కొనసాగుతారా లేదా తెలియడం లేదని వివరించింది.
Elon Musk,English national news,International news,National telugu news,spam bots,Twitter Deal,world’s richest man