2022-07-07 00:45:47.0
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య, ప్రేయసి ద్వారా ఏడుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తన కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే షివోన్ జిలిస్ ద్వారా నవంబర్ 2021లో ట్విన్స్‌కు తండ్రైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ అనే పత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్, జిలిస్ కలిసి తమ పిల్లల పేర్లను మార్చుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. పిల్లల ఇద్దరి […]
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఇద్దరు పిల్లలకు తండ్రయ్యారు. మస్క్ ఇప్పటికే తన మాజీ భార్య, ప్రేయసి ద్వారా ఏడుగురు పిల్లలకు తండ్రయ్యాడు. తన కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసే షివోన్ జిలిస్ ద్వారా నవంబర్ 2021లో ట్విన్స్‌కు తండ్రైనట్లు బిజినెస్ ఇన్‌సైడర్ అనే పత్రిక బుధవారం కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మస్క్, జిలిస్ కలిసి తమ పిల్లల పేర్లను మార్చుకునేందుకు కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
పిల్లల ఇద్దరి పేర్ల చివర తండ్రి పేరు, మిడిల్‌నేమ్‌గా తల్లి పేరును చేర్చేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ వారిద్దరూ పిటిషన్ దాఖలు చేశారు. మే నెలలో టెక్సాస్ జడ్జి వారికి అనుమతులు జారీ చేసినట్లు తెలిసింది. వెస్ట్‌లా లీగల్ రీసెర్చ్ సర్వీస్ అనే సంస్థ జడ్జి సంతకం చేసిన ఒక కోర్టు డాకెట్‌ను చూపించారు. ఇద్దరు పిల్లల పేర్లను మార్చడానికి అనుమతి ఇస్తున్నట్లుగా దానిపై రాసుంది. ఈ ఏడాది ఏప్రిల్ 25న మస్క్, జిలిస్ వేసిన పిటిషన్‌కు మే 11న జడ్జి అనుమతి ఇచ్చారు.
ఎలాన్ మస్క్ ఇటీవల 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ డీల్ ప్రాథమిక చర్చల అనంతరం ట్విట్టర్‌ను నడిపించడానికి కొంత మంది సొంత మనుషులను మస్క్ నియమించుకున్నారు. అందులో షివోన్ జిలిస్ కూడా ఒకరని తెలుస్తున్నది. 36 ఏళ్ల జిలిస్ ప్రొఫైల్‌ను ‘LinkedIn’ లో పరిశీలించగా, ఆమె ప్రస్తుతం న్యూరాలింక్ అనే సంస్థలో ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్టులకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. న్యూరాలింక్ వ్యవస్థాపకుల్లో ఎలాన్ మస్క్ కూడా ఒకరు. అంతే కాకుండా ఆయన ఆ కంపెనీకి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
న్యూరాలింక్ కంపెనీలో జిలిస్ 2017 మేలో చేరారు. అదే నెలలో ఆమెను టెస్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. ఆ పదవిలో ఆమె 2019 వరకు ఉన్నారు. ఎలాన్ మస్క్ స్థాపించిన మరో సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI). ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్‌లో నిమగ్నమైంది. ఈ కంపెనీ బోర్డు మెంబర్‌గా కూడా జిలిస్ పని చేశారు.
ఎలాన్ మస్క్‌కు కెనడియన్ సింగర్ గ్రిమ్స్ ద్వారా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇక మాజీ భార్య, కెనడియన్ రచయిత్రి జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. గత ఏడాది డిసెంబర్‌లోనే గ్రిమ్స్‌కు బిడ్డ పుట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది సరోగసి ద్వారా జన్మించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతానికి గ్రిమ్స్‌తో పూర్తిగా విడిపోలేదని.. మస్క్ స్పష్టం చేశారు. కాగా, ట్విన్స్ విషయంపై మాత్రం మస్క్, జిలిస్ ఇంకా స్పందించలేదు.
Elon Musk,Elon Musk is now father,Justine Musk,Shivon Zilis,Tesla