ఠాణాకు బేడీలతో తాళం!

https://www.teluguglobal.com/h-upload/2024/11/04/1374624-handcups.webp

2024-11-04 07:29:28.0

తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌ లో చిత్రం

నేరస్తుల చేతులకు వేసే బేడీలతో ఠాణాకు తాళం వేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌ లో ఈ చిత్రం దర్శనమిచ్చింది. పెండింగ్‌ బిల్లుల కోసం ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి మాజీ మంత్రి హరీశ్‌ రావు, శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ కు తరలివచ్చారు. వారిని ఎలా కంట్రోల్‌ చేయాలో అర్థం కాక బేడీలతో ఠాణా గేటుకు తాళం వేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీస్‌ స్టేషన్‌ల నిర్వహణకు నిధులు ఇవ్వడం లేదు. దీంతో తాళం కొనేందుకు కూడా నిధులు లేవని.. అందుకే పోలీస్‌ స్టేషన్‌ గేటుకు బేడీలతో తాళం వేశారని ఆందోళన చేస్తున్న సర్పంచులు, వారికి మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్‌ నాయకులు కామెంట్‌ చేశారు.

Sarpanchs,Thirumlagiri Police Station,Locked with Handcups