డబ్బు చెల్లింపుతో సంబంధం లేదు : కేటీఆర్

2024-12-28 10:00:24.0

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ హైకోర్టులో కేటీఆర్ అఫిడవిట్ సమర్పించారు.

ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఒప్పందాల అమలు, డబ్బు చెల్లింపుతో  సంబంధం లేదని విధానపరమైన అంశాలను చూసే బాధ్యత.. మంత్రిగా తనది కాదని పేర్కొన్నాడు. ఇక విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు పై అనుమతుల వ్యవహారాన్ని సంబంధిత బ్యాంక్‌దేలని తెలిపారు. చెల్లింపుల విషయంలో అన్ని అంశాలను హెచ్‌ఎండీఎనే చూసుకోవాలన్నారు.

మాజీ మంత్రి. రూ.10 కోట్లు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్న హెచ్‌ఎండీఎ నిబంధనల్లో ఎక్కడా లేదన్న కేటీఆర్.. నిధుల బదిలీ మంత్రిగా తనకు సంబంధం లేని విషయం అని చెప్పారు. అలాగే 10వ సీజన్‌ పోటీలు జరగలేదు కాబట్టి రీఫండ్ కోసం… ఫార్ములా ఈ-రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు కేటీఆర్.

KTR,Telangana High Court,Counter affidavit,Formula Race,case of racing,Formula E-Race company,BRS Party,HMDA,M Revanth reddy,Telanagana goverment,minister ponguleti srinivas reddy,Revenue department,Congress party,KCR,BRSParty