https://www.teluguglobal.com/h-upload/old_images/500x300_307731-1213397.webp
2022-06-01 05:17:20.0
దేశంలో డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా మెడిసిన్స్ ఉపయోగిస్తూ, డైట్ కంట్రోల్ చేసుకుంటే డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చని డాక్టర్లు అంటున్నారు. అయితే, డయాబెటిక్ పేషెంట్లు ఏవి తినాలి ఏవి తినొద్దు అనే వాటిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగవద్దని కొంత మంది సూచిస్తుంటారు. కానీ, వైద్య నిపుణులు మాత్రం కొబ్బరి నీళ్లు డయాబెటిస్ పేషెంట్లకు మంచిదని అంటున్నారు. ఎండాకాలంతో పాటు ఇతర […]
దేశంలో డయాబెటిస్‌తో బాధపడే వాళ్లు పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా మెడిసిన్స్ ఉపయోగిస్తూ, డైట్ కంట్రోల్ చేసుకుంటే డయాబెటిస్ వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్స్ నుంచి బయటపడవచ్చని డాక్టర్లు అంటున్నారు. అయితే, డయాబెటిక్ పేషెంట్లు ఏవి తినాలి ఏవి తినొద్దు అనే వాటిపై అనేక అనుమానాలు ఉన్నాయి.
ముఖ్యంగా కొబ్బరి నీళ్లు తాగవద్దని కొంత మంది సూచిస్తుంటారు. కానీ, వైద్య నిపుణులు మాత్రం కొబ్బరి నీళ్లు డయాబెటిస్ పేషెంట్లకు మంచిదని అంటున్నారు.
ఎండాకాలంతో పాటు ఇతర రోజుల్లో చాలా మంది కొబ్బరి నీళ్లు తాగడానికి ఇష్టపడుతుంటారు. డీహైడ్రేషన్ నుంచి త్వరగా బయటపడేయడానికి కొబ్బరి నీళ్లు ఉపయోగపడుతుంటాయి. ఒక గ్లాసెడు కొబ్బరి నీళ్లలో కేవలం 60 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఇవి తాగడం వల్ల మనం రోజువారీ తీసుకునే క్యాలరీలు పెద్దగా పెరిగే అవకాశం లేదు.
కొబ్బరి బోండాం నుంచి తాజాగా తీసిన నీళ్లలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కణాలకు హాని చేసే ఆక్సిడేటీవ్ స్ట్రెస్‌ను నియంత్రించడంతో పాటు, ఇన్సూలిన్ రెసిస్టెన్స్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
అందువల్ల ప్రీ-డయాబెటిస్ ఉన్న వారితో పాటు డయాబెటిక్ పేషెంట్లకు ఈ నీళ్లు చాలా మేలు చేస్తుంటాయి. దీనిలో ఉండే మెగ్నీషియం గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో కూడా దోహదం చేస్తుంది.
అంతే కాకుండా గుండె, కిడ్నీల ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు.
కాగా, కొబ్బరి నీళ్లలో కాసిన్ని సబ్జా గింజలు వేసుకొని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. సబ్జా గింజలు మల బద్దకాన్ని కూడా తగ్గిస్తుంటాయి.
Coconut water is good for diabetics,Sugar Control Tips in Telugu
sugar control tips in telugu, sugar control tips in telugu news,
https://www.teluguglobal.com//2022/06/01/diabetic-patients-should-not-drink-coconut-water-what-do-experts-say/