https://www.teluguglobal.com/h-upload/2024/07/05/500x300_1341732-diabetes.webp
2024-07-05 03:55:01.0
డయాబెటిస్ వచ్చే ముందే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ స్టేజ్‌నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. అయితే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సమస్యను అంచనా వేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా ఉంటుంది.
ఈ రోజుల్లో ఎక్కువమందిని వేధిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ మొదటిస్థానంలో ఉంది. మనదేశంలో సుమారు పది శాతం మంది అంటే సుమారు పది కోట్ల మంది ఈ సమస్యతో భాధపడుతున్నారు. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తించకపోవడం వల్లనే సమస్య ముదురుతోందని డాక్టర్లు చెప్తున్నారు. డయాబెటిస్‌ను ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే.
డయాబెటిస్ వచ్చే ముందే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ స్టేజ్‌నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. అయితే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సమస్యను అంచనా వేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా ఉంటుంది.
శరీరంలోని షుగర్ లెవల్స్‌లో మార్పులు వచ్చినప్పుడు అతిగా దాహం వేయడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి మార్పులు గమనిస్తే కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించాలి. అలాగే షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఆకలి పెరగడం, ఆయాసం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి ముదరకుండా ఉంటుంది.
గాయాలు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసక బారడం వంటివి కూడా డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలే. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు కూడా ఓసారి షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం మంచిది.
జాగ్రత్తలు ఇలా..
శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినట్టు గుర్తిస్తే.. దాన్ని ప్రీడయాబెటిక్ స్టేజ్‌గా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించేందుకు ముందుగా డైట్లో మార్పులు చేసుకోవాలి. హైక్యాలరీ ఫుడ్స్‌ను తగ్గించి ఫైబర్ ఉండే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలను డైట్లో చేర్చుకోవాలి.
ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచే వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే షుగర్ సమస్య ముదరకుండా, బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. రోజుకి కనీసం ఇరవై నిముషాల పాటైనా వ్యాయామం చేస్తే.. ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఇకపోతే స్మోకింగ్ అలవాటు, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి డయాబెటిస్ రిస్క్‌ను మరింత పెంచుతాయి. కాబట్టి వాటిని మార్చుకోవాలి. స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
Diabetes,Diabetes Tips in Telugu,Health Tips
Diabetes, Diabetes tips, telugu news, health tips, news
https://www.teluguglobal.com//health-life-style/early-signs-and-symptoms-of-diabetes-1045757