డాకు మహరాజ్‌ ఫస్ట్‌ డే కలెక్షన్లు రూ.56 కోట్లు

 

2025-01-13 07:44:17.0

https://www.teluguglobal.com/h-upload/2025/01/13/1394078-daku-maharaj.webp

అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్‌

సంక్రాంతికి రిలీజ్‌ అయిన డాకు మహరాజ్‌ ఫస్ట్‌ డే రూ.56 కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఈ విషయం మూవీ టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్‌ లో వచ్చిన డాకు మహరాజ్‌ ను నాగవంశీ ప్రొడ్యూస్‌ చేశారు. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధ శ్రీనాద్‌ హీరోయిన్లుగా నటించగా ఉర్వశీ రౌతేల ప్రత్యేక పాత్రలో నటించారు. బాలయ్య మూవీకి హిట్‌ టాక్‌ రావడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. బాలకృష్ణ సినిమాల్లో మొదటి రోజు అత్యధికంగా వసూళ్లు దక్కించుకున్న సినిమాల జాబితాలో డాకు మహరాజ్‌ చోటు దక్కించుకుంది.

 

Daku Maharaj,Balakrishna,Baby,Naga Vamshi,Frist Day Collections,Rs.56 Crores