2025-02-28 16:08:33.0
తెలుగు వైద్యుడికి పద్మవిభూషణ్ రావడం ఎంతో గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్‌గా నాగేశ్వర్ రెడ్డికి అరుదైన గౌవరం దక్కిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ దక్కించుకున్నారని ఆయన తెలిపారు. ఆయనకు భారతరత్నకు కుడా అర్హుడని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని హెల్త్ హబ్‌గా మార్చేందుకు నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరం అని సీఎం అన్నారు.
అందరికీ ఉపయోగకరమైన ఆరోగ్య పాలసీ తీసుకురావాలని కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు.హెల్త్, బల్క్‌డ్రగ్ విషయంలో హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. కొవిడ్ సమయంలో చాలా దేశాలకు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్లు ఎగుమతి అయ్యాయిని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగు వైద్యుడికి పద్మవిభూషణ్ రావడం సంతోషంగా ఉందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు ఇంతటి గుర్తింపు దక్కడం హర్షణీయమని పేర్కొన్నారు
Dr. Nageshwar Reddy,Padma Vibhushan,Gastroenterologist,Health Hub,CM Revanth Reddy,Hyderabad,Telanagana goverment,mimister damodhara