డిజిటల్ రూపీ వచ్చేస్తుంది! ఈ విషయాలు తెలుసా?

https://www.teluguglobal.com/h-upload/2022/11/12/500x300_425597-digital-rupee.webp
2022-11-12 13:38:23.0

Digital rupee: నాణేలు పోయి నోట్లు వచ్చాయి. వాటి తర్వాత ఆన్‌లైన్ పేమెంట్లు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా డిజిటల్ రూపీ వచ్చేసింది. అసలు ఏంటీ డిజిటల్ రూపీ దీన్నెలా అర్థం చేసుకోవాలి?

నాణేలు పోయి నోట్లు వచ్చాయి. వాటి తర్వాత ఆన్‌లైన్ పేమెంట్లు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా డిజిటల్ రూపీ వచ్చేసింది. అసలు ఏంటీ డిజిటల్ రూపీ దీన్నెలా అర్థం చేసుకోవాలి?

భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ రూపీని ఒక మైలురాయిగా చెప్తున్నారు. దీనివల్ల వ్యాపారాలు, రోజువారీ లావాదేవీలు సులభంగా, సేఫ్‌గా జరుగుతాయని ప్రభుత్వం అంటోంది. అసలు ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

-ఆర్బీఐ డిజిటల్ రూపంలో తీసుకొచ్చిన కొత్త కరెన్సీనే ‘సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ’ అంటారు. ఇది క్రిప్టో కరెన్సీ మాదిరిగానే వర్చువల్ రూపంలో వాడుకలో ఉంటాయి. అయితే క్రిప్టోల మాదిరిగా డిజిటల్ రూపీ డిసెంట్రలైజ్డ్ కాదు. డిజిటల్ రూపీపై ఆర్బీఐ నియంత్రణ, పర్యవేక్షణ ఉంటాయి.

డిజిటల్ కరెన్సీకి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రతి రూపాయిని ట్రేస్ చేయవచ్చు. డిజిటల్ రూపీ ప్రోగ్రామబుల్ కూడా. అంటే అవసరమైనప్పుడు అదనపు విలువలు, టైం లిమిట్, వాలిడిటీ లాంటివి కుడా జోడించొచ్చు.

డిజిటల్ కరెన్సీ ద్వారా జరిగిన అన్నీ లావాదేవీల సమాచారం బ్లాక్-చైన్ రూపంలో ఎన్‌క్రిప్ట్ అయ్యి ఉంటుంది. కాబట్టి మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

డిజిటల్ రూపీకి అంతర్జాతీయంగా ఆమోదం ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా ఆర్థిక లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు ఉంటుంది.

డిజిటల్ రూపీతో పారదర్శకత పెరుగుతుంది. చెల్లింపు, నిర్వహణలో మరింత సేఫ్టీ ఉంటుంది. అలాగే డిజిటల్ రూపీ లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంక్ అకౌంట్ అవసరం ఉండదు.

డిజిటల్ కరెన్సీ ద్వారా చేసేవి రియల్-టైమ్ పేమెంట్లు. అంటే అన్ని లావాదేవీలపై ప్రభుత్వానికి యాక్సెస్ ఉంటుంది. ప్రభుత్వానికి తెలియకుండా లావాదేవీ జరపడం కష్టం.

డిజిటల్ రూపీని పోగొట్టుకోవడం లేదా డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉండదు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఏవైనా మోసాలు జరిగినా సులభంగా ట్రేస్ చేయొచ్చు.

ముందుగా ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో డిజిటల్ రూపీని పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టనున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. రిటైల్ సెగ్మెంట్‌లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో పలు ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు పనిచేస్తున్నాయి.

Digital Rupee,RBI,Cryptocurrency,India
Digital rupee, future money, RBI, digital rupee launched in India, payment system easy, wholesale, reserve bank of India, central bank, digital currency, crypto currency, benefits of digital rupee, e-rupee in India, CBDC, డిజిటల్ కరెన్సీ, ఆర్బీఐ డిజిటల్, డిజిటల్ రూపీ, క్రిప్టో కరెన్సీ

https://www.teluguglobal.com//business/digital-rupee-is-coming-do-you-know-these-things-356819