2024-10-05 13:05:04.0
పవన్ కళ్యాణ్ పై మధురై లో కేసు నమోదు
https://www.teluguglobal.com/h-upload/2024/10/05/1366496-pavan-stalin.webp
డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం మధ్య సాగిన మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని మధురైలో వాంజినాథన్ అనే అడ్వొకేట్ కంప్లైంట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంపై చర్యలు తీసుకోవాలని తన కంప్లైంట్ లో కోరారు. సనాతన ధర్మం గురించి గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ గతంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టాలని చూసిన వాళ్లే తుడిచి పెట్టుకుపోతారని హెచ్చరించారు. పవన్ కామెంట్స్ పై మీడియా ప్రతినిధులు ఉదయనిధిని స్పందన కోరగా.. ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అన్నారు. పవన్ కామెంట్స్ పై జనసైనికులు.. డీఎంకే కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. మధురైలో పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టడాన్ని జనసైనికులు ఎలా తీసుకుంటారు.. ఏపీలో కౌంటర్ కేసులు ఏమైనా పెడుతారా చూడాల్సి ఉంది.
Pavan Kalyan,Udayanidhi Stalim,Sanathana Dharma,Case Booked on Pavan