2024-11-13 13:47:54.0
ఎన్డీయే కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
https://www.teluguglobal.com/h-upload/2024/11/13/1377514-rrr.webp
ఎన్డీయే కూటమి తరపున అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్‌తో పాటు మంత్రులు నారా లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉపసభాపతి స్థానానికి నామినేషన్ దాఖలు చేయటం సంతోషంగా ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇతర ఏ నామినేషన్‌లు రాకపోతే తన ఎన్నిక ఏకగ్రీవం కానుందన్నారు. రేపు మధ్యా 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ పదవికి ఆర్‌ఆర్‌ఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించే అవకాశం ఉంది.