డిసెంబర్‌ 4న నాగచైతన్య, శోభిత పెళ్లి

 

2024-11-18 14:38:31.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/18/1378928-nagachaitanya-shobitha-wedding-card.webp

అన్నపూర్ణ స్టూడియోలో పెళ్లి.. ముహూర్తం రాత్రి 8.13 గంటలకు

అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు డిసెంబర్‌ 4వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. అన్నపూర్ణ స్టూడియోనే పెళ్లి వేదిక. రాత్రి 8.13 గంటలకు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది. ఇరు కుటుంబాలు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పంచుతున్న శుభలేఖలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. కొత్త జంటకు అభిమానులు, సన్నిహితులు ఇప్పటి నుంచే శుభాకాంక్షలు చెప్తున్నారు.

 

Naga Chaitanya,Shobhitha Dhulipala,Wedding,4th December,Annapurna Studio,Akkineni Nagarjuna