2025-01-19 11:09:49.0
ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ అధికార డీఎంకే కండువా కప్పుకున్నారు
https://www.teluguglobal.com/h-upload/2025/01/19/1395836-dmk.webp
ప్రముఖ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. అనంతరం దివ్య మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని దివ్యా పేర్కొన్నారు. తాను చిన్నప్పటి నుంచి డీఎంకే విధానాల పట్ల ఆకర్షితురాలియ్యానని, ప్రజా సేవపై ఆసక్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
దివ్య సత్యరాజ్ 2019 ఎన్నికల సమయంలోనే స్టాలిన్ ను కలిశారు. దాంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారంటూ అప్పట్లోనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని నాడు సత్యరాజ్ కుటుంబం పేర్కొంది. కాగా, దివ్య ఫుడ్ న్యూట్రిషనిస్టుగా పనిచేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తాను న్యూట్రిషనిస్టునని, డీఎంకే ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే పార్టీ అని… ఆ పార్టీలో చేరడానికి ఇది కూడా ఓ కారణమని అన్నారు
actor Sathyaraj,Divya,Tamil Nadu CM MK Stalin,Nutritionist,Tamil Nadu,Udhayanidhi Stalin,DMK