2025-01-25 09:49:23.0
డీజే టిల్లు సినిమా పాటకు మంత్రి సీతక్క డ్యాన్స్ చేసి.. అక్కడున్న యువతీ యువకుల్లో జోష్ నింపారు.
రాష్ట్ర మంత్రి సీతక్క ములుగు జిల్లాలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3కే రన్ నిర్వహించారు. అయితే, ఈ 3కే రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు మూవీలోని పాటకు డ్యాన్స్ చేశారు. డీజే టిల్లు పాటకు కాళ్లు కదిపి అక్కడున్న యువతీ యువకుల్లో మంత్రి జోష్ నింపారు.
సీతక్క డ్యాన్స్‌కు ఫిదా అయిన యువకులు చప్పట్లు, ఈలలతో అభినందించారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతక్క డ్యాన్స్‌కు ఫిదా అయిన యువకులు ఈలలు, చప్పట్లతో అభినందించారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి.. విద్యార్థులు, యవకులతో కలిసి సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Minister Sitakka,DJ Tillu,Mulugu District,Social media,CM Revanth reddy,Road Safety Months